Breaking News

కొత్త లోకా నటి బర్త్‌ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌!

Published on Wed, 10/15/2025 - 19:02

బర్త్‌ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్‌డేను స్పెషల్‌గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.

తన బర్త్‌ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్‌ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.

కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది.  జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత  లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 - చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.
 

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)