Breaking News

'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!

Published on Thu, 06/22/2023 - 07:48

అక్కినేని అఖిల్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎందుకో అదృష్టం కలిసి రావట్లేదు. ఏప్రిల్ చివర్లో 'ఏజెంట్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. విడుదలకు ముందు మంచి హైప్ ఏర్పడింది. కానీ మార‍్నింగ్ షో పడగానే టాక్ బయటకొచ్చేసింది. సినిమా తేలిపోయింది. దీంతో ఘోరంగా నష్టాలొచ్చాయి. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా అందరూ మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి టైంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్.. 'ఏజెంట్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'అఖిల్ ఏజెంట్ చిత్ర హక్కుల్ని మేం తీసుకోవాలనుకున్నాం. నిర్మాతలను అడిగాం. కానీ ఆయనేమో భారీగా డిమాండ్ చేశారు. అంత రేటు వర్కౌట్ కాదులే అని.. మేం తీసుకోవట్లేదు. వేరే వాళ్లకు ఇచ్చేయండి అని చెప్పాం. నిజంగా ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడాడు' అని నిర్మాత సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఇప్పుడు ఈ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఒకవేళ 'ఏజెంట్' హక్కుల్ని తీసుకుని ఉంటే భారీ మొత్తంలో ఆయనకు నష్టం వచ్చేదని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు థియేటర్లలోకి వచ‍్చి 50 రోజులు పైనే అవుతున్నా ఇంకా 'ఏజెంట్' ఓటీటీలోకి రాలేదు. ఎడిటింగ్ చేసిన కొత్త వెర్షన్ ని జూన్ 23 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  

(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఫస్ట్‌లుక్.. ఇది గమనించారా?)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)