Breaking News

ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్

Published on Fri, 09/22/2023 - 16:07

ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

ఏమైంది?
దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్‪‌కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది.

(ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్‌లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్‌!)

ఐదు నెలల తర్వాత
అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా  విశేషమే.

కథేంటి?
రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష‍్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్‌.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా?  అన్నదే 'ఏజెంట్' స్టోరీ. 

(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్‌ లవ్‌ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)