Breaking News

దసరా విలన్‌పై మరో నటి ఆరోపణలు.. సెట్‌లో చాలా అసభ్యంగా!

Published on Thu, 04/24/2025 - 15:43

దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. ‍అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ ‍టాపిక్‌గా మారింది.

 విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ ‍కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది.  సెట్‌లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్‌ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.

(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్‌)

కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్‌ నటించిన గుడ్ బ్యాడ్‌ ‍అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)