Breaking News

మరో లవ్‌స్టోరీతో రాబోతున్న మణిరత్నం.. హీరో ఎవరంటే?

Published on Thu, 08/07/2025 - 13:33

జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఇంకా చెప్పాలంటే అపజయాలను ఎదుర్కోని మనిషే ఉండడు. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా మణిరత్నంకు ఇండియన్‌ ఏస్‌ డైరెక్టర్‌ అనే పేరు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు అలాంటివి. ఓ నాయకన్‌, ఒక దళపతి ,ఒక ముంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కూడా పొన్నియన్‌ సెల్వన్‌ అంటే చారిత్రిక కథా చిత్రాన్ని ఆయన అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించారు. అలాంటి దర్శకుడు తాజాగా దర్శకత్వం వహించిన థగ్‌లైఫ్‌ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయనపై విమర్శల దాడే జరిగింది. అలాగని మణిరత్నం కృంగిపోలేదు. అలాగైతే ఆయన అన్ని సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించే వారే కాదు.

తాజాగా మరో యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీతో రావడానికి సిద్ధమవుతున్నారన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అందుకు ఆయన యువ నటుడు, స్టార్‌ హీరో విక్రమ్‌ కొడుకు  ధ్రువ్‌ విక్రమ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు, కథానాయిక రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధ్రువ్‌ విక్రమ్‌ మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈయన మారిసెల్వరాజ్‌ దర్శకత్వంలో బైసన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

క్రీడా నేపథ్యంగా రూపొందుతున్న బైసన్‌ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా తదుపరి ధ్రువ్‌విక్రమ్‌ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్‌ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌లో సెట్‌ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలో వెలుపడే అవకాశం ఉంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)