Breaking News

‘ఆఫ్రో తపాంగ్’ సాంగ్‌ రిలీజ్‌.. శివన్న, ఉపేంద్ర మాస్‌ డ్యాన్స్‌ వైరల్‌!

Published on Sun, 11/02/2025 - 11:28

కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్‌ కుమార్(Shivarajkumar)‌, ఉపేంద్ర(Upendra), రాజ్‌ బి శెట్టి(Raj B.Shetty) ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ-స్టారర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ '45' (45 The Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 25న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'ఆఫ్రో తపాంగ్' పాటని విడుదల చేశారు.  

జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకి  ఉపేంద్ర, శివన్నలతో పాటు రాజ్‌ బి శెట్టి కూడా అదిరిపోయే స్టెప్పులేశారు. శివన్న యాక్షన్ ఫ్లెయిర్‌తో, ఉప్పి స్టైలిష్ ట్విస్ట్‌లతో, రాజ్ బి. శెట్టి ఎనర్జీతో హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్‌ 1న ఈ పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది.  చాలాకాలం తర్వాత శివరాజ్‌కుమార్‌, ఉపేంద్రల మాస్‌ డ్యాన్స్‌ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాండల్‌వుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ-స్టారర్ పాటల్లో ఒకటిగా ‘ఆఫ్రో తపాంగ్‌’ నిచిలిపోతుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)