Breaking News

'విరాజి' థ్రిల్లింగ్‌తో పాటు మెసేజ్‌ ఇస్తాడు: దర్శకుడు ఆద్యంత్ హర్ష

Published on Sat, 07/27/2024 - 20:32

మహా మూవీస్,  ఎమ్ 3 మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విరాజి'. వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున​ ఈ చిత్రాన్ని ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.  మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న విరాజి సినిమా గురించి దర్శకుడు ఆద్యంత్‌ హర్ష పలు విషయాలు పంచుకున్నాడు.

ఫారిన్‌లో చదువుకున్న డైరెక్టర్‌ ఆద్యంత్‌ హర్ష సినిమాల పట్ల ఆసక్తితో  ఫిల్మ్ మేకింగ్ నేర్చకున్నాడు. సుమారు పది కథలు రాసుకున్న ఆయన విరాజి చిత్రాన్ని ఫైనల్‌గా తెరకెక్కిస్తున్నారు. గతేడాది 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు చెప్పడంతో ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ మహేంద్రనాథ్‌కు నచ్చడం ఆపై  వరుణ్ సందేశ్‌ను హీరోగా ఫైనల్‌ చేశామని ఆయన అన్నారు. 

'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించిందని ఆద్యంత్‌ తెలిపారు.

'విరాజి' అనే టైటిల్‌కు అర్థం.. చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడని ఆయన అన్నారు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు అంటారని తెలిపారు.  'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారని ఆద్యంత్‌ తెలిపారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందని ఆయన అన్నారు.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)