Breaking News

భార్య ప్రైవేట్‌ వీడియోలు తీశాడు: సింగర్‌ నిజస్వరూపం బయటపెట్టిన తమ్ముడు

Published on Sat, 04/08/2023 - 19:28

స్టార్‌ సింగర్‌, పద్మశ్రీ గ్రహీత అద్నాం సమీ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చాడు. పాప్‌ ఆల్బమ్స్‌తో సంగీతప్రియులను హుషారెత్తించాడు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అద్నాం సమీ సోదరుడు జునైద్‌ ఖాన్‌ సింగర్‌పై సంచనల వ్యాఖ్యలు చేశాడు. 'నా పెద్దన్న అద్నాన్‌ సమీ నిజస్వరూపం బయటపెట్టాల్సిన సమయం వచ్చేసింది. నేను ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ భయపడను. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే! అతడిలా నేను అబద్ధాలు చెప్పను' అంటూ కొన్ని పాయింట్స్‌ రాసుకొచ్చాడు.

► అద్నాన్‌ సమీ 1969 ఆగస్టు 15న రావల్‌ పిండి ఆస్పత్రిలో జన్మించాడు. నేను కూడా అదే ఆస్పత్రిలో 1973లో పుట్టాను. అద్నాన్‌ చెప్పినట్లుగా అతడు ఇంగ్లాండ్‌లోనో, మరెక్కడోనో పుట్టలేదు.
► నాకు టాలెంట్‌ ఉంది, నేను పాడగలనని అద్నాన్‌ను తెలుసు. తనకంటే నా గొంతు బాగుందని చాలామంది అన్నారు. కావాలనుకుంటే ఆయన నాకు సాయం చేయొచ్చు. కానీ తను స్వార్థంగా ఆలోచించాడు. నన్ను ఇండియన్‌ ఇండస్ట్రీలో లాంచ్‌ చేయలేదు. ఒకవేళ నేను తనకన్నా పేరు తెచ్చుకుంటానని భయపడ్డాడేమో! ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఇందుకు అతడే కారణం.

► అద్నాన్‌ సమీ ఇంగ్లాండ్‌లోని రగ్బీ స్కూల్‌లో చదువుకున్నాడు. కానీ తనకు చదువు అబ్బలేదు. అందుకే ఫేక్‌ డిగ్రీలు సంపాదించాడు. లాహోర్‌ యూనివర్సిటీలో బీఏ చదివాడు. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం యూకేలో లా చదివానని చెప్తాడు.
► అన్నిటికంటే కూడా మమ్మల్ని బాగా బాధపెట్టిన విషయం. 1997లో అతడు తన మూడేళ్ల కొడుకు అజాన్‌ను తీసుకుని దుబాయ్‌, కెనడా, అమెరికా వెళ్లాడు. ఏడేళ్లు వచ్చేదాకా పిల్లవాడు తల్లితో ఉండాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. కానీ అద్నాన్‌ అదేమీ పట్టించుకోలేదు.

► ఇది మరీ దారుణ విషయం. నా గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా నేనలా ప్రవర్తించలేదు. 2007/2008లో అద్నాన్‌ సమీ తన రెండో భార్య సబా గలదేరీ పోర్న్‌ వీడియోలు తీశాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా గుట్టుగా ఉండాలి. కానీ ఆ వీడియోలను అతడు కోర్టుకు సమర్పించాడు. తానసలు ఆ వీడియోలు తీయలేదని, సబా ప్రియుడే వాటిని తీసి ఉండవచ్చని ఆమెపై నిందలు వేశాడు. 
► ఇండియాలో అయితే బాగా డబ్బులు వస్తాయనే తను పాకిస్తాన్‌ పౌరసత్వం వదులుకుని ఇక్కడ సెటిలయ్యాడు. అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో జునైద్‌ సదరు పోస్ట్‌ డిలీట్‌ చేశాడు. కాగా పాకిస్తానీ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అర్షద్‌ సమీ ఖాన్‌ తనయులే అద్నాన్‌, జునైద్‌. అద్నాన్‌ సమీ మొదట పాకిస్తానీ సినిమాలకు సంగీతం అందించాడు. ఆశా భోంస్లేతో చేసిన 'కభీ తో నజర్‌ మిలావో' ఆల్బమ్‌ హిట్‌ కావడంతో ఆయనకు భారత్‌లోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అలా ఆయన ఇండియన్‌ సినిమాలకు సైతం పనిచేశాడు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?