Breaking News

ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి

Published on Fri, 07/26/2024 - 11:29

ఖత్రాన్‌ కి ఖిలాడీ.. ఇదొకరియాలిటీ సో.. ఇందులో పాల్గొనే వారితో రకరకాల స్టంట్లు చేయిస్తారు. వారి భయాల్ని పోగొడుతారు. అన్ని భయాలను దాటుకుని చివరిదాకా నిలబడ్డవారే విజేతగా నిలుస్తారు. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇప్పటివరకు 13 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం 14వ సీజన్‌ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే కొంత షూటింగ్‌ జరిగిపోయింది.

నా గురించి నేను తెలుసుకున్నా
దాని గురించి ఈ సీజన్‌లో పాల్గొన్న నటి అదితి శర్మ మాట్లాడుతూ.. ఇదొక క్రేజీ ప్రయాణం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ చేయగలం. నేను చాలా ఎంజాయ్‌ చేశాను. కొన్ని రోజులు సంతోషంగా, మరికొన్ని రోజులు కష్టంగా గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో నా బలాలు, బలహీనతలు తెలుసుకున్నాను. నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని షాక్‌లు తగిలినప్పుడైతే జీవితాన్ని ఆస్వాదించడం, ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ ప్రపంచం అందమైనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది నాకిప్పుడు అందంగానే కనిపిస్తోంది.

అవన్నీ నిజమైనవే
భారత్‌కు రాగానే అందరూ అడిగిన ప్రశ్న.. షోలో చూపించేవి నిజమైన స్టంట్సేనా? అని! అవును నిజమే.. ఎలక్ట్రిక్‌ షాక్‌లు, కీటకాలు, జంతువులు.. ఇలా ప్రతీది నిజమే.. ఓ స్టంట్‌లో అయితే కొన్ని తేళ్లు నా మెడను కుట్టేశాయి. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటివేమైనా జరిగితే స్పాట్‌లో ట్రీట్‌మెంట్‌ చేస్తారు. అయినా ఆ నొప్పి భరించలేము' అని చెప్పుకొచ్చింది. కాగా అదితి.. ఖత్రాన్‌ కి ఖిలాడీ షో కోసం రొమేనియాలో దాదాపు 40 రోజుల పాటు ఉంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చింది.

చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)