Breaking News

దర్శకుడు శంకర్‌ కూతురు ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా..?

Published on Sat, 10/12/2024 - 07:34

సినిమా రంగంలో సెంటిమెంట్‌ ఎక్కువేనని చెప్పక తప్పదు. ఒక్క హిట్‌ వస్తే చాలు సినిమా పరిశ్రమ నెత్తికెక్కించుకుంటుంది. అదే ఒక్క ప్లాప్‌ వచ్చినా, ఐరన్‌లెగ్‌ ముద్ర వేసేస్తారు.  దర్శకుడు శంకర్‌ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన అదితి శంకర్‌ కథానాయకిగా తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం కార్తీకు జంటగా 'విరుమాన్‌'లో నటించి హిట్‌ అందుకున్నారు. అందులో ఆమె గాయనిగానూ పరిచయం అయ్యారు. అదే విధంగా అదితి శంకర్‌ నటించిన రెండవ చిత్రం మహావీరన్‌ (మహావీరుడు) కూడా హిట్‌ అయ్యింది. దీంతో ఈమెను గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు. 

ప్రస్తుతం ఆకాశ్‌ మురళికి జంటగా కోలీవుడ్‌లో నేశిప్పాయా అనే చిత్రంతో పాటు అర్జున్‌దాస్‌కు జంటగా మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. వీటి తరువాత నటుడు అధర్యకు జంటగా ఇంకో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నేశిప్పాయా చిత్రం ద్వారా దివంగత నటుడు మురళి రెండవ వారసుడు ఆకాశ్‌ మురళి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి విష్ణు వర్ధన్‌ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  

నేశిప్పాయా చిత్రంతో నటి అదితి శంకర్‌ తన సక్సెస్‌ను కొనసాగిస్తారా? హ్యాట్రిక్‌ కొడతారా? అన్నదే ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇందులోని తొలంజ మనసు అనే పల్లవితో సాగే పాటను తాజాగా విడుదల చేశారు. కాగా ఇందులో ప్రభు, శరత్‌కుమార్‌, కుష్భూ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)