Breaking News

హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి

Published on Sun, 03/30/2025 - 08:54

టాప్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్‌ వస్తే ఏ నటులైనా ఎగిరి గంతేస్తారు. అలా ఆయన డైరెక్షన్‌లో హీరామండి (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసే అవకాశం హీరోయిన్‌ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)కి వచ్చింది. సెకండ్‌ థాట్‌ లేకుండా వెంటనే ఓకే చేసింది. హీరామండి: ద డైమండ్‌ బజార్‌ సిరీస్‌లో బిబ్బోజాన్‌గా నటించింది. అందులో ఆమె గజగామిని నడక సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయిందో అందరికీ తెలిసిందే!

అవకాశాలు జలపాతంలా కురుస్తాయనుకున్నా..
అయితే ఈ సిరీస్‌ తర్వాత తనకు మంచి అవకాశాలే రావడం లేదంటోంది బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ.. హీరామండి సిరీస్‌లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకున్నాను. కానీ ఆ ఊహలో నుంచి త్వరగానే బయటపడ్డాను. ఎందుకంటే అవకాశాలు జలపాతంలా కురవడం కాదు కదా.. ఏకంగా కరువే ఏర్పడింది. ఆ సిరీస్‌ తర్వాత ఏ ప్రాజెక్టుకూ నన్ను సంప్రదించలేదు. ఛాన్సులు లేవని పెళ్లి చేసుకోలేదు కానీ... సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

అందుకే పెళ్లి చేసుకున్నా..
 ఎలాగోలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి సిద్దార్థ్‌తో మూడు ముళ్లు వేయించుకున్నాను. సిద్దార్థ్‌ చాలా మంచి మనిషి. పెళ్ల ప్రస్తావన తెచ్చినప్పుడు సెకను ఆలోచించకుండానే ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. సిద్దార్థ్‌, అదితి రావు హైదరి గతేడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక అదితి రావు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న ఓ సినిమాలో భాగం కానుంది. ఇంతియాజ్‌ అలీ డైరెక్ట్‌ చేయనున్న ఈ చిత్రంలో అవినాష్‌ తివారితో కలిసి నటించనుంది. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కి.మీ పర్‌ హవర్‌, వి, మహాసముద్రం చిత్రాలు చేసింది.

చదవండి: పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానన్నా.. కానీ తనే..: జెనీలియా 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)