Breaking News

ప్రేమికుల రోజున సీనియర్‌ హీరోకి అదితి ప్రపోజ్‌! సిద్ధార్థ్‌ రియాక్షన్‌ ఇదే..

Published on Tue, 02/14/2023 - 15:11

హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్‌ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు.

చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్‌ ట్వీట్‌

రీసెంట్‌గా యంగ్‌ హీరో శర్వానంద్‌ నిశ్చితార్థంలో సిద్ధార్థ్‌-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్స్‌ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్‌ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్‌కు షాకిచ్చింది. సిద్ధార్థ్‌కు కాకుండ మరో సీనియర్‌ హీరోకి ఆమె ప్రపోజ్‌ చేసింది. వాలంటైన్స్‌ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి బాలీవుడ్‌ సీనియర్‌ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్‌ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: ఎయిర్‌పోర్ట్‌ వివాదం: విజయ్‌ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఈ ఫొటోని అదితి తన ఇన్‌స్టా‍గ్రామ్‌ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్‌’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే పోస్ట్‌పై హీరో సిద్ధార్థ్‌ స్పందించడం విశేషం.పోస్ట్‌ 2 హార్ట్‌ ఎమోజీలతో అదితి పోస్ట్‌పై స్పందించాడు. అయితే వాలంటైన్స్‌ డే రోజున సిద్ధార్థ్‌కు ప్రపోజ్‌ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)