Breaking News

సిద్ధార్థ్‌,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?

Published on Mon, 09/16/2024 - 15:56

నటుడు సిద్ధార్థ్‌ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో  అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.

అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి  పేరు ఎహసాన్ హైదరీ.  తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి  విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు కూడా అదితి హైదరి మనవరాలు  అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. 

 (ఇదీ చదవండి:  ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)

ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్‌. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్‌ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. 

వనపర్తి  రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు  తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ‍ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)