Breaking News

అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్‌ డైరెక్టర్‌

Published on Sun, 06/18/2023 - 15:06

ఆదిపురుష్‌ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. అంతే భారీగా విమర్శలు సైతం వస్తున్నాయి. దశరథుడిగా ప్రభాస్‌ లుక్‌ బాలేదని, కొన్ని డైలాగ్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్‌ చాలా పేలవంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆదిపురుష్‌ టీం కొన్ని తప్పులను సరిదిద్దుకునేందుకు రెడీ అయింది. ముఖ్యంగా హనుమంతుడితో చెప్పించే మాస్‌ డైలాగ్స్‌ను తీసేసి ఆ స్థానంలో కొత్తవి చేర్చనున్నట్లు ప్రకటించారు.

రామాయణం తెలుసంటే అబద్ధమే
అయినప్పటికీ ఈ ట్రోలింగ్‌ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌కు అసలు రామాయణం తెలుసా? అని ఆడేసుకుంటున్నారు. నటీనటులను ఓం రౌత్‌ సరిగా వాడుకోలేకపోయాడని నెట్టింట రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ నెగెటివ్‌ రివ్యూలపై ఓం రౌత్‌ స్పందించాడు. 'బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి స్పందన వస్తుందన్నది ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇకపోతే నాకు రామాయణం అంతా తెలుసని చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను. 

అంత ఈజీ కాదు
నాకూ, మీకూ తెలిసిన రామాయణం ఉడుత చేసే సాయమంత ఉంటుంది. నాకు అర్థమైన కొంత భాగాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించడం అంత సులువు కాదు, అందుకే యుద్ధకాండలోని కొంత భాగంపై నేను దృష్టి సారించా. అయినా రామాయణాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంత సులువేమీ కాదు. నాకు రామాయణం మొత్తం తెలుసు అని ఎవరైనా అంటున్నారంటే వాళ్లు తెలివి తక్కువ వాళ్లైనా అయి ఉండాలి లేదంటే అబద్ధమైనా చెప్తుండాలి' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్‌. ఇకపోతే ఆదిపురుష్‌ మొదటి రోజు రూ.140 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే!

చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? నన్ను, నా తల్లిని తిడుతున్నారు: ఆదిపురుష్‌ రచయిత

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)