Breaking News

హనుమంతుడి నోట మాస్‌ డైలాగ్స్‌.. వివాదంపై స్పందించిన రచయిత

Published on Sat, 06/17/2023 - 16:16

ఆదిపురుష్‌ విషయంలో అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అనేలా ఉంది పరిస్థితి! ప్రభాస్‌ ఫ్యాన్స్‌, రామ భక్తులంతా సినిమా చూసి పండగ చేసుకుంటారనుకుంటే చాలామంది మెచ్చుకోలేక, నొచ్చుకోలేక సైలెంట్‌ అయిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలను, డైలాగులను అస్సలు సహించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో మంట పెడతారు. ఆ సమయంలో హనుమాన్‌ ఇంద్రజిత్తుతో.. నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది... దానికి రాసిన చమురు నీ బాబుది... నిప్పు కూడా నీ బాబుకే.. అన్నట్లుగా ఓ డైలాగ్‌ చెబుతాడు. హనుమాన్‌కు మరీ ఇంత మాస్‌ డైలాగ్‌లు అవసరమా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. 

తాజాగా ఈ వివాదంపై ఆదిపురుష్‌ డైలాగ్‌ రచయిత మనోజ్‌ ముంతషీర్‌ స్పందించాడు. 'నావైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. ఎంతో నిశితంగా ఆలోచించాకే హనుమంతుడి సంభాషణలు రాశాను. సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా.. పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమంతుడి భాషను సింపుల్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాను. లంకా దహనం సమయంలో హనుమంతుడి చెప్పే డైలాగ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కానీ మనందరికీ రామాయణం ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తేనే కదా మనం తెలుసుకున్నాం. రామాయణంపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా నానమ్మ, అమ్మమ్మలు రామాయణ కథలను చాలా సింపుల్‌గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. దాన్నే నేను ఆదిపురుష్‌లో వాడాను. అంతే తప్ప, నేనేమీ కొత్తగా డైలాగ్‌ సృష్టించలేదు' అని వివరణ ఇచ్చాడు.

చదవండి: ఆదిపురుష్‌ రిజల్ట్‌.. ఇలా జరిగిందేంటబ్బా. . ఈ తప్పుల వల్లే!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు