Breaking News

'ఆదిపురుష్' 6వ రోజు కలెక్షన్.. మరీ ఇంత తక్కువ!?

Published on Thu, 06/22/2023 - 13:03

ప్రభాస్ 'ఆదిపురుష్' హడావుడి తగ్గినట్లే కనిపిస్తుంది. తొలి మూడు రోజుల్లో ఆకాశమే హద్దు అన్నట్లు రయ్ మని దూసుకెళ్లాయి. నాలుగో రోజు నుంచి సడన్ గా డ్రాప్ అయ్యాయి. ఆరో రోజైన బుధవారమైతే మరింత తక్కువగా వచ్చాయి. మొత్తం నంబర్ చూడటానికి పెద్దగా ఉండొచ్చు కానీ రోజువారీ లెక్కలు మాత్రం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి.

(ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి)

ఆరురోజుల్లో ఎన్నికోట్లు?
రామాయణం ఆధారంగా తీసిన 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఓ మాదిరి హైప్ ఏర్పరుచుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. చాలామందికి ఈ సినిమా నచ్చుండొచ్చు కానీ విమర్శలు చేసేవాళ్లు మాత్రం ఎక్కువయ్యారు. వాటి ప్రభావమో ఏమో గానీ కలెక్షన్స్ పై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పొచ్చు. ఆరో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఓవరాల్ నంబర్ రూ.410 కోట్లకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి?
రెండు తెలుగు రాష్ట‍్రాల్లో 'ఆదిపురుష్'కి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువగానే థియేటర్లకు వెళ్తున్నారు. ఐదో రోజుకు మన రాష్ట్రాల్లో రూ.75.70 కోట్ల షేర్ ఉండగా, ఆరో రోజుకి రూ.77.53 కోట్లు అయింది. అంటే దాదాపు రూ.1.83 కోట్లు మాత్రమే వచ్చింది. వర్కింగ్ డేస్ లో ఇలా ఉంటే పర్లేదు గానీ ఈ వీకెండ్ లో మాత్రం పుంజుకోవాలి లేదంటే మాత్రం భారీ నష్టాలు తప్పవు!? 

(ఇదీ చదవండి: స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)