ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!

Published on Thu, 03/14/2024 - 12:56

అదిల్‌ దురానీ.. వివాదాస్పద నటి రాఖీ సావంత్‌తో నడిపిన ‍ప్రేమాయణంతోనే ఇతడి పేరు అందరికీ తెలిసింది. అదిల్‌ కోసం, అతడి కుటుంబం కోసం పొట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేసింది రాఖీ. సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు ముదిరిపోవడంతో భర్తపై వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో గతేడాది జైలుకు కూడా వెళ్లొచ్చాడు అదిల్‌. తర్వాత ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

రహస్యంగా నిఖా చేసుకోలేదు
ఇటీవలే అదిల్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోమి ఖాన్‌ను పెళ్లాడాడు. ఈ రెండో పెళ్లి గురించి అతడు మాట్లాడుతూ.. 'చాలామంది నేను ఎలా మళ్లీ పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నారు. నేనొక ముస్లింను.. కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునే అధికారం నాకుంది. నేనేమీ రహస్యంగా నిఖా చేసుకోలేదు. కుటుంబసభ్యుల అంగీకారంతో వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాను. రిసెప్షన్‌ కూడా నిర్వహించాం.

మంచి లైఫ్‌ కోరుకోవడం తప్పా?
ఇప్పుడు నేను నా భార్యతోనే కలిసున్నాను. నాకంటూ మంచి జీవితం కోరుకోవడం తప్పు కాదే! రాఖీ(మాజీ భార్య) ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. తను నాకు ఏనాడూ సంతోషాన్ని పంచలేదు. ఆమె ఎవరి జీవితంలో ప్రవేశించినా వారికి ఆనందమనేదే ఉండదు. కానీ నేను తనలా కాదు.. సంతోషాన్ని పంచుతాను. సోమి నా జీవితంలోకి వెలుగును తీసుకొచ్చింది. తనతో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఓటీటీలో హారర్‌ సిరీస్‌.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌..

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)