Breaking News

ఒక్క హిట్టు.. 12 సినిమాలకు సంతకం చేశా.. చివరికి!

Published on Sat, 04/27/2024 - 14:05

ఫెయిల్యూర్‌ వస్తే ఎవరూ పట్టించుకోరు.. అదే సక్సెస్‌ వస్తే వారి పేర్లు మార్మోగిపోతాయి. అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆ ఫేమ్‌ సరిగా వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. ఏమాత్రం తప్పటడుగులు వేసినా మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్‌ నటుడు అధ్యాయన్‌ సుమన్‌ విషయంలో ఇదే జరిగింది. నటుడు శేఖర్‌ సుమన్‌ తనయుడిగా 'హాల్‌ ఇ దిల్‌' అనే సినిమాతో 2008లో వెండితెరపై అడుగుపెట్టాడు. రెండో చిత్రం రాజ్‌ 2తో సక్సెస్‌ కొట్టాడు.

ఒకేసారి 12 సినిమాలకు సంతకం
సక్సెస్‌ రావడంతో బోలెడన్ని ఆఫర్లు రాగా అన్నింటికీ ఓకే చెప్పాడట. దాని గురించి అధ్యాయన్‌ మాట్లాడుతూ.. 'రాజ్‌ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను, మంచి పేరొచ్చేసిందని ఓవర్‌ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. ఓ వార్తా పత్రిక సైతం టాప్‌ 5 న్యూకమర్స్‌ అంటూ రణ్‌బీర్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ సరసన నా ఫోటో కూడా పబ్లిష్‌ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్‌ యూటర్న్‌ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్‌ బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ కాలేదు.

మంచి సినిమా.. కానీ!
దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా.. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాతి సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్‌ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్‌ అందుకుని అక్కడే ఆగిపోయాను.

నాకే ఎందుకిలా..
నాకే ఎందుకిలా జరిగిందని కొన్నేళ్లపాటు ఆలోచించాను. చివరకు ఇలా ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేకన్నా జీవితంలో ఏది వచ్చినా ముందుకు సాగిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అధ్యాయన్‌ సుమన్‌, తండ్రి శేఖర్‌ సుమన్‌ ప్రస్తుతం 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)