Breaking News

న్యాయం చేయండంటూ జడ్జి ముందు ఏడ్చేసిన నటి

Published on Sat, 09/02/2023 - 09:54

తిరువళ్లూరు: నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్‌ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు చేసిన సినీనటి విజయలక్ష్మి తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. దీంతో పాటు ఆధారాలను న్యాయమూర్తికి సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ నేత సీమాన్‌ తన సహచర నటి విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

ఆందోళన చేపట్టిన నటి
దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్‌ స్టేసన్‌లో సీమాన్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉండటంతో పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తానూ, సీమాన్‌ సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు.

పోలీస్‌ స్టేషన్‌లో 6 గంటలు విచారణ
ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్‌ ఉమయాల్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ గౌతమ్‌, సీఐలు మహ్మద్‌బర్గతుల్లా, రాజ్యలక్ష్మి.. విజయలక్ష్మిని శుక్రవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ఆరు గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు.

ఆధారాలు సమర్పించిన నటి
గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని న్యాయమూర్తి కోరగా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తనకు సీమాన్‌ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కంటతడిపెట్టారు. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం బందోబస్తు నడుమ విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు.

చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)