Breaking News

ప్రేమ పేరుతో మోసం.. ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగట్లే: నటి ఆవేదన

Published on Mon, 08/28/2023 - 17:08

తమిళ నటి, తెలుగులో 'హనుమాన్‌ జంక్షన్‌' సినిమాలో నటించిన విజయలక్ష్మి మరోసారి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. నామ్‌ తమిళర్‌ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్‌ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. మోసం చేయడమే కాకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్‌ చేయాలని పోలీసులను వేడుకుంది. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతూ.. 'నేను సీమన్‌పై గతంలోనూ ఫిర్యాదు చేశాను. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అంతకుముందున్న ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదు' అని పేర్కొంది.

సహజీవనం.. ముఖం చాటేసిన సీమన్‌
కాగా విజయలక్ష్మి.. సీమన్‌పై గతంలోనూ ఈ ఆరోపణలు చేసింది. 2007-2009 వరకు సీమన్‌, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేశాడంది. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ సీమన్‌ సెటిల్‌మెంట్‌కు రావడంతో కేసు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆత్మహత్యాయత్నం
అయితే విజయలక్ష్మిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరగడంతో 2020లో విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్‌ మీడియాలో సీమన్‌, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియో పోస్ట్‌ చేసి మరీ సూసైడ్‌కు యత్నించింది. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడింది.

చదవండి: ఆమె మోజులో హీరో.. అతడినే గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్‌.. అప్పుడు డిప్రెషన్‌లో.. ఇప్పుడు నడవలేని స్థితిలో..
వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)