Breaking News

సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ

Published on Sat, 03/02/2024 - 18:44

ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్‌ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం?

(ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్)

తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొనసాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్‌తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది.

గతంలో హీరో విశాల్‌తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని నెలల గ్యాప్‌లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. 

నికోలయ్‌.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)