Breaking News

రివ్యూవర్స్‌పై వరలక్ష్మి అసహనం, అసలు మీరెవరంటూ మండిపడ్డ నటి

Published on Sun, 02/12/2023 - 13:06

డేరింగ్‌ అండ్‌ బోల్డ్‌ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియా రివ్యూవర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఆమె నటించిన లేటెస్ట్‌ తమిళ్‌ మూవీ ‘కొండ్రల్‌ పావమ్‌’. తెలుగులో చిత్రం ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్‌ ఇది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి ఆమె మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.  ఈ సందర్భంగా ఓ తమిళ చానల్‌తో ముచ్చటించిన ఆమె సోషల్‌ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రివ్యూ చేప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలంది. ‘ఈ మధ్య ఇలా కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయో లేదో అలా సోషల్‌ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

చదవండి: ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది?

ఇంకా చెప్పాలంటే కొన్ని రిలీజ్‌ కాకముందే ట్రైలర్‌, టీజర్లు చూసి వాళ్లకు అనిపించింది చేప్పేస్తున్నారు. అలా అర్థంపర్థంలేని రివ్యూలు ఇస్తూ ప్రేక్షకుడిని తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు. మూవీ ఈ సినిమాలో ఇది బాగోలేదు, ఆ సినిమాలో అది బాగోలేదు, అసలు మూవీలో సందేహమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా. అసలు మీరూ ఎలాంటి సినిమా ఆశిస్తున్నారు?’ అని ప్రశ్నించింది.  అనంతరం ‘మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంజాయ్‌ చేయడం మర్చిపోయి నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఇది ఎక్కువ అయిపోయింది. అసలు సినిమా హిట్టు లేదా ఫ్లాప్‌ అని చెప్పడానికి వాళ్లేవరు. అది ప్రేక్షకుల నిర్ణయం. మూవీ బాగుందా? లేదా అని చెప్పేది ఆడియన్స్‌ మాత్రమే. ప్రేక్షకులను సినిమా చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ.. అలాగే కొంతమంది సినిమా కలెక్షన్స్‌ గురించి వాగ్వాదాలకు దిగుతున్నారని, ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్‌ చేయండంటూ రివ్యూవర్స్‌కి ఆమె సూచించింది. దీంతో ఆమె కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతొంది. అంతేకాదు ఆమె మాట్లాడిని వీడియోను వరలక్ష్మి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)