Breaking News

సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష

Published on Fri, 03/13/2026 - 08:28

నటి త్రిష పేరు వార్తల్లో మారుమోగుతోంది. ఏ న్యూస్‌ పేపర్‌ చూసిన, ఏ సామాజిక మాధ్యమాలు చూసిన త్రిష గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. చివరికి రాజకీయ వర్గాల్లోనూ త్రిష సెంటర్‌ పాయింట్‌గా మారారు. ఆ మధ్య నటుడు విజయ్, త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్రిషకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా నటుడు విజయ్‌ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం తీవ్ర సంచలనానికి గురిచేసింది. అందులో తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకోవడమే తను విడాకులు కోరడానికి  కారణం అని కూడా సంగీత పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనడం పెద్ద చర్చకు దారి తీసింది.

అలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్‌ నటుడు పార్థిబన్‌ కూడా నటి త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వ్యాఖ్యలను నటి త్రిష తీవ్రంగా ఖండించింది. దీంతో పార్థిబన్‌ కూడా ఆమెకు క్షమాపణలు చెప్పడం ఆపై పొరపాటు అని మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇలా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో నటి త్రిష గురించి మరో ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆమె ఇటీవల నటించిన విడాముయర్చి, థక్‌ లైఫ్‌ చిత్రాలు పూర్తిగా నిరాశ పరచడంతో పాటు త్రిష నటనను ఆమె ఎంచుకున్న పాత్రల గురించి  తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈమె కొత్తగా చిత్రాలను అంగీకరించలేదు. 

రాజకీయాల వైపు త్రిష
తెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు  చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో త్రిష కొత్తగా చిత్రాలను ఒప్పుకోవడం లేదని దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ, ఆమధ్య తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు రాజకీయాలు తనకు తెలియదని  నటి త్రిష పేర్కొన్నారు. అయితే, అది అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష  రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఒక వర్గం పేర్కొంటుంది. ఇప్పటికే ప్రముఖ స్టార్‌గా వెలుగొందిన నటుడు విజయ్‌ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్‌ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)