Breaking News

ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా

Published on Wed, 02/25/2026 - 11:54

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటోంది హీరోయిన్‌ తమన్నా భాటియా. చేతిలో అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు వాటిని భద్రంగా కాపాడుకోవాలని చెప్తోంది. ఆ ముందుజాగ్రత్త లేకపోతే మొదటికే మోసం వస్తుందని, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. రెండు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే ఆభరణాల బిజినెస్‌లో అడుగుపెట్టింది.

నాన్న వల్లే..
ఆర్థిక భద్రత గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో నాన్నే నా ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇప్పటికీ ఈ విషయంలో ఆయన సపోర్ట్‌, గైడెన్స్‌ ఎంతగానో ఉంది. ప్రస్తుతం నేను నా పెట్టుబడి వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాను. రియల్‌ ఎస్టేట్‌, జ్యువెలరీ.. ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టాలన్న ముందుచూపుకు నాన్నే కారణం. ఆయన దగ్గరినుంచే ఈ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది.

సంపాదన ఉన్నప్పుడే..
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో యాక్టర్స్‌ భారీగా సంపాదించగలరు. కానీ, దాన్ని సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి. ఆ డబ్బును రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేయాలి. లేదంటే మాత్రం చివరకు ఏమీ మిగలదు అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన వివాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌ మూవీ మే 15న విడుదల కానుంది.

చదవండి: పవన్‌ కల్యాణ్‌పై పూనమ్‌ సెటైర్లు

Videos

Good News: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. అధిక పెన్షన్ పునరుద్ధరణ

Eluru : టీడీపీ నేతలకు షాక్! నేవీ డిపోకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

డయేరియా వ్యాప్తికి కారణం అదే దయచేసి చర్యలు తీసుకోండి

హోమంలో పాల్గొన్న జగన్

Youtuber కోమలి ఘటనలో బయటపడ్డ CCTV వీడియో

అమెరికాలోని ఫ్లోరిడాలో కార్చిచ్చు

రామ్, భాగ్యశ్రీకి... బ్రేకప్ చెప్పారా..?

ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు

విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..

ఫెరారీ కారు ప్రమాద ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదల

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)