Breaking News

ఆ సినిమాతో నన్ను మరదలిగా ఫిక్స్‌ అయిపోయారు: స్వాతి రెడ్డి

Published on Tue, 05/16/2023 - 12:53

స్వాతి కంటే కలర్స్ స్వాతి అంటేనే ఠక్కున గుర్తు పట్టేస్తారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన వారిలో స్వాతిరెడ్డి ఒకరు. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి.. ఆ తర్వాత నటిగా రాణించింది. ఎలాంటి పాత్రను ఇచ్చినా అవలీలగా చేస్తూ ఉంటుంది  తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తనదైన నటనతో మెప్పించింది.

(ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోతుందని చెప్పారు: శివ బాలాజీ)

స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో వచ్చిన అష్టాచెమ్మా చిత్రం ఆమెకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. ఆ తర్వాతనే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్వాతి కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

(ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్‌ సినిమా రికార్డ్ బ్రేక్!)

స్వాతి మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎప్పటికప్పుడు ఒక సినిమా తరువాత మరో సినిమా అవకాశం రాదనుకునేదాన్ని.'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలో వెంకటేశ్‌కు మరదలు రోల్ చేశా. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత అన్నీ మరదలు పాత్రలే వచ్చాయి. అవీ చేయడానికి నేను ఇష్టపడలేదు. నా గ్రాఫ్ పడిపోతుందనుకున్న  ప్రతిసారి ఏదో ఒక హిట్ పడేది. అలా ఈ రోజున నేను చెప్పుకోవడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. 'స్వామి రారా' .. 'సుబ్రమణ్యపురం' 'కార్తికేయ' అలాంటివే. నా కెరియర్‌లో 'డేంజర్' సినిమా సమయంలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తున్నారు. 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)