Breaking News

'ఛావా'పై వివాదాస్పద కామెంట్లు.. వివరణ ఇచ్చిన స్వర భాస్కర్!

Published on Sat, 02/22/2025 - 08:33

ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ చేసిన ట్వీట్స్‌ వివాదానికి దారితీశాయి. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల గుండెలను తాకింది. అయితే, ఈ సినిమా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహాకుంభ్‌ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. కొద్దిరోజుల క్రితం మహాకుంభ్‌ మేళాలో జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు తెరకెక్కించిన కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేసింది. 

అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. అది కాస్తా వివాదానికి దారితీయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. ఫైనల్లీ వాటికి వివరణ ఇస్తూ ఆమె పోస్ట్‌ చేసింది. ఛావా మూవీలో ఔరంగజేబు చేతిలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితం అని ఎలా అంటావ్‌ అంటూ ఆమెపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆమె ఇలా విరణ ఇచ్చింది. 

'నేను వ్యక్తపరిచిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మన చరిత్రను నేను ఎంతగానో గౌరవిస్తాను. ఛత్రపతి శివాజీ ఘనతల్ని కీర్తించడంలో నేను గౌరవిస్తాను. కానీ, దయచేసి ప్రస్తుత కాలంలోని తప్పులు, వైఫల్యాలను దాచడానికి గత వైభవాన్ని దుర్వినియోగం చేయవద్దు. చారిత్రక అవగాహన ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించాలి. ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాదు. చరిత్ర అందర్నీ కలిపేలా ఉండాలి. కానీ, విడదీసేలా కాదు. నా మునుపటి ట్వీట్ ఏదైనా మీ మనోభావాలను దెబ్బతీస్తే.. నేను చింతిస్తున్నాను. అందరితో పాటు నేను కూడా మన భారత చరిత్ర గురించి తెలుసుకొని గర్వపడుతున్నాను.' అని ఆమె అన్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)