Breaking News

హాస్పిటల్‌ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Fri, 10/20/2023 - 23:24

'రాజ రాజ చోర'  సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. 2005లో  కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సునయన తెలుగులో సమ్‌థింగ్‌ స్పెషల్‌, 10th క్లాస్‌ సినిమాలు చేసింది. కాదలిల్‌ విడుంతేన్‌ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నీర్‌ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు సైతం అందుకుంది.  తమిళ బిగ్‌బాస్‌ 4 సీజన్‌లోనూ పాల్గొంది. విశాల్‌కు జోడీగా నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. తెలుగులో  'రాజ రాజ చోర' సినిమా ద్వారా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!)

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఒక పోస్ట్‌ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. చేతికి సెలైన్‌ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను సునైన షేర్‌ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్‌ అయింది. ఆమెకు ఏమైందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఏ కారణం వల్ల ఆమె ఆస్పత్రిలో చేరారో తెలపలేదు. కానీ త్వరలో మరింత దృఢంగా తిరిగి వస్తానని మాత్రం చెప్పుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

గతంలో హీరోయిన్‌ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమెను ఎవరో కిడ్నాప్‌ చేశారని ప్రచారం జరిగింది. తర్వాత అదంతా డ్రామా అని, ఒక సినిమా కోసం వాళ్లు చేసిన ఫ్రాంక్‌ వీడియో అని అసలు విషయం తెలిసింది. అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అదే మాదిరి ఇప్పుడు కూడా ఏదైనా సినిమా ప్రమోషన్స్‌ కోసం చేస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ‘రెజీనా’ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)