Breaking News

పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని

Published on Wed, 03/26/2025 - 07:46

సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు మనలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే తమకు ఫలానా వ్యాధి ఉందని చెబుతుంటారు. రెండుమూడేళ్ల క్రితం హీరోయిన్ సమంత (Samantha) కూడా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కూడా తనకున్న అనారోగ్య సమస్యలు గురించి బయటపెట్టింది.

తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సుహాసిని.. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ పలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనకు టీబీ (TB Disease) ఉందనే విషయాన్ని రివీల్ చేశారు. పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టానని చెప్పుకొ‍చ్చారు.

(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్)

'నాకున్న జబ్బుని నేను సీక్రెట్‌గా ఉంచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి, అందరికీ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను' అని సుహాసిని చెప్పుకొచ్చారు.

తమిళనాడుకు చెందిన సుహాసిని 1980లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1988లో దర్శకుడు మణిరత్నంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. ఈమెకు చిన్నాన్న అవుతాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)