Breaking News

నేను అందంగా లేనని మొహం మీదే అన్నారు.. కానీ: శోభిత

Published on Wed, 03/01/2023 - 18:22

గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. మేజర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించింది. ఆమె హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్‌. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్‌ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ది నైట్‌ మేనేజర్‌ వెబ్ సిరీస్‌లో కనిపించింది.  తాజాగా గతంలో ఎదురైనా ఓ సంఘటనను గుర్తు చేసుకుంది శోభిత. 

మొదట మోడల్‌గా పని చేస్తున్న రోజుల్లో ఆడిషన్స్‌కు వెళ్తే ఎవ్వరూ కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపింది. ఓ ప్రముఖ కంపెనీ తనను బ్యాక్‌గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికి రావన్నారని.. కానీ ఆ తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని చెప్పుకొచ్చింది శోభిత. 

శోభిత మాట్లాడుతూ.. 'నేను అందంగా లేనని ఓ కంపెనీ వాళ్లు అన్నారు. నేను కూడా వెంటనే అవును అని ఒప్పుకున్నా. నా 20 ఏళ్ల వయసులో ఓ షాంపు కంపెనీకి వాణిజ్య ప్రకటన కోసం వెళ్లా. ఆ సమయంలో తనను బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికి రావు అన్నారు. కొంతకాలం తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చింది.

అయితే గతంలో నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేసింది శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఆమె నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ రెండో భాగం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)