Breaking News

హీరోయిన్‌ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!

Published on Fri, 06/30/2023 - 15:40

ఒకప్పటి ప్రముఖ హీరోయిన్‌ సంఘవి తెలుగు తెరపై కనిపించక 18 ఏళ్లవుతోంది. ఆమె చివరగా కొలాంజి అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి పర్సనల్‌ లైఫ్‌కే పూర్తి సమయం కేటాయించింది. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది కానీ బయట మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే గత నెలలో మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సంఘవి.

తాజాగా మరోసారి తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సంఘవి ప్రస్తుతం జడ్జిగా సినిమాలు చేస్తున్నానని, ఏదైనా మంచి రోల్స్‌ వస్తే తప్పకుండా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

కాగా సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా నటించిన 'అమరావతి' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ  హీరోలతో నటించింది. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ తళుక్కుమని మెరిసింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాలతో అభిమానులను మెప్పించింది.

సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, మృగరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, ఆంధ్రావాలా.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఆమె నటించిన హిట్‌ సినిమాలు చాలానే ఉన్నాయి. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి హీరోయిన్‌గా నటించింది. ఈమె మలయాళీ కుటుంబం నుంచి వచ్చిన ఐటీ సంస్థ అధినేత ఎన్‌. వెంకటేశ్‌ను 2016 ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకుంది. వీరికి 2020లో కూతురు పుట్టింది.

చదవండి: దిల్‌ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల హవా

లస్ట్‌ స్టోరీస్‌ 2 రివ్యూ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)