Breaking News

పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్‌.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్‌ నటి

Published on Mon, 02/10/2025 - 09:58

జైలర్‌ నటుడు, కమెడియన్‌ రెడిన్‌ కింగ్‌స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో సీరియల్‌ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 డిసెంబర్‌ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ఇప్పుడు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. వారి  వివాహం తర్వాత అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. కానీ, సంగీతకు కూడా ఇదేమీ ఫస్ట్‌ మ్యారేజ్‌ కాదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. ఒకరోజు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే, ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గుడ్‌న్యూస్‌ చెప్పారు. సంగీత సీమంతం వేడుక జరిగే వరకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని వారు తెలుపలేదు. ఇలా సడెన్‌గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Toకాగా రెడిన్‌ కింగ్‌స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 

ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. నెల్సన్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్‌ యాక్ట్‌ చేశాడు. డాక్టర్‌ మూవీలో ఈయన పోషించిన భగత్‌ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.

సంగీతకు రెండో పెళ్లి
గతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్‌తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై  ఆ సమయంలో భారీగానే ట్రోల్స్‌ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)