Breaking News

రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా

Published on Fri, 06/20/2025 - 18:39

యాంకర్‌, బుల్లితెర నటి సమీరా షెరిఫ్‌ (Sameera Sherief) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సమీరా- సయ్యద్‌ అన్వర్‌ దంపతులు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త చాప్టర్‌ ప్రారంభిస్తున్నాం అని రాసుకొచ్చారు. అలాగే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు.. సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సమీరా ప్రెగ్నెన్సీ జర్నీ..
సమీరా 2019లో అన్వర్‌ జాన్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాదే నటి తొలిసారి గర్భం దాల్చింది. అప్పుడు ఆమె తమిళంలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్‌ అవగానే హాస్పిటల్‌కు వెళ్దామనుకుంది. అంతలోనే తీవ్ర రక్తస్రావమై కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. తర్వాత 2021లో మరోసారి ప్రెగ్నెంట్‌ అయింది. అలా ఆమెకు అర్హాన్‌ జన్మించాడు. 2023లో మరోసారి ప్రెగ్నెంట్‌ కావడంతో ఇంటిల్లిపాది ఎంతో సంతోషించారు. కానీ  బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్‌ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.

సమీరా ఎందుకింత పాపులర్‌?
ఆడపిల్ల సీరియల్‌తో సమీరా ఒక్కసారిగా పాపులర్‌ అయింది. అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ.. ఇలా ఎన్నో ధారావాహికలు చేసింది. అదిరింది షోకి కొన్నిరోజులపాటు యాంకర్‌గానూ వ్యవహరించింది.

 

 

చదవండి: జెన్‌ Z అంటే ఇదేనా? ఆశిష్‌ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)