Breaking News

ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్.. ఇబ్బందిపడ్డా: హీరోయిన్‌

Published on Wed, 03/11/2026 - 13:30

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటుంది నటి సమీరా రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందని, తాను కూడా ఇది ఫేస్‌ చేశానని చెబుతోంది. తెలుగులో `నరసింహుడు`, `అశోక్‌` ‘జై చిరంజీవా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో..సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ ట్రోల్స్‌ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించింది.

‘సినిమా ఇండస్ట్రీలో  అందానికే ఎక్కువ ప్రాధాన్యత. టాలెంట్‌ గురించి పట్టించుకోరు. తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. సాధారణంగా ఓ నటిగా, మహిళగా ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించాను. కానీ మరింత అందంగా కనబడాలంటూ నాకు మేకప్‌ వేసేవాళ్లు. ముఖానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా మేకప్‌ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. అలా చెప్పడం నన్ను చాలా బాధించింది. నిజంగానే నేను అందంగా లేనేమో అనే భావన నాలో కలిగింది. 

అంతేకాదు, నేను స్లిమ్‌గా లేనని బాధపడేదాన్ని. నేను చాలా పొడుగ్గా ఉండడంతో.. వయసులో పెద్దదిగా చూసేవాళ్లు. అది నా మైండ్‌లో అలా ఉండిపోయేది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నా బాడీ సైజు గురించే మాట్లాడేవాళ్లు కానీ.. టాలెంట్‌, యాక్టింగ్‌ గురించి చర్చ జరిగేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. 'అసలు వాళ్లు చెప్పినట్లు ఎందుకు చేశాను. అలా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్‌. అలా చేయకతప్పదు’ అని సమీరా(Sameera Reddy) చెప్పుకొచ్చింది.

ఇక బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరంలో మార్పు వచ్చింది. వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను'
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)