15 ఏళ్ల తర్వాత సమీరా రెడ్డి రీఎంట్రీ..

Published on Fri, 04/24/2026 - 11:58

బాలీవుడ్ న‌టి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. 2014లో వ్యాపారవేత్త  అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా..  అంతకు ముందే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. కృష్ణం వందే జగద్గురుం (2012) మూవీలో  ప్రత్యేక గీతంలో మాత్రమే ఆమె కనిపించారు. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆఖ్రీ సవాల్’లో కీలక పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది.

ఆఖ్రీ సవాల్ మూవీలో సమీరా రెడ్డి పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. తన రీఎంట్రీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నటించబోయే పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని సమీరా వెల్లడించింది. రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే, నటనకు ఆస్కారం కల్పించే అర్థవంతమైన పాత్రలపైనే తన దృష్టి  ఉంటుందని ఆమె నొక్కి చెప్పింది.

ఆఖ్రీ సవాల్ చిత్రాన్ని  జాతీయ అవార్డు దర్శకుడు అభిజీత్ మోహన్ వారంగ్ తెరకెక్కిస్తున్నారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని కథగా రాసుకుని ఈ మూవీని తీసినట్లు స‌మాచారం. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.  ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్‌డీ విద్యార్థి పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఆఖ్రీ సవాల్‌ చిత్రం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌పై  వచ్చిన ఆరోపణలు గురించి చూపించనున్నారు. ఇందిరా గాంధీ హత్య‌ తర్వాత జరిగిన ఘటనలు.. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలను ఈ మూవీలో చూపనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందా, సంజయ్ దత్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
 

Videos

మా డాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం..

ఏకంగా 93% పోలింగ్.. రికార్డు సృష్టించిన బెంగాల్ ఓటర్లు..

సిలబస్ లో లేని ప్రశ్నలు.. లోకేష్ మళ్లీ అదే తప్పు

జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి

హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్

మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు

RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!

Photos

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)