Breaking News

హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!

Published on Wed, 08/09/2023 - 11:30

కొందరు కొన్ని అలవాట్లను వదులుకోలేరు. హీరోయిన్ సాయిపల్లవికి ఒక విచిత్రమైన అలవాటు ఉందట. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో దాన‍్ని కొంతకాలం పక్కనపెట్టి మెడిలస్ పూర్తి చేసింది. 1992లో నీలగిరి ప్రాంతంలో పుట్టిన ఈమె.. 2015లో వైద్య విద్యను పూర్తి చేసింది. వయసులో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ గా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కస్తూరి మాన్‌, దామ్‌ ధూమ్‌ అనే చిత్రాల్లో చిన్నపాత్రల్లో నటించింది. ఇక పూర్తిస్థాయిలో కథానాయకిగా నటించిన చిత్రం ప్రేమమ్‌. 

(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)

ఈ మలయాళ చిత్రం ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మలయాళ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. ముఖ్యంగా తెలుగులో పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. తమిళంలో సూర్యతో చేసిన 'ఎన్‌జీకే' నిరాశపరిచింది. చిన్నతనం నుంచి నాట్యంలో శిక్షణ తీసుకున్న సాయి పల్లవి 2008లోనే ఉంగళిల్‌ యార్‌ అడుత్త ప్రభుదేవా అనే టీవీ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది.

అయితే సాయిపల్లవి డ్యాన్స్ షోలో పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు. సరే ఇవన్నీ పక్కనబెడితే సాయిపల్లవి తనకు ఓ విచిత్రమైన అలవాటు ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను తరచూ విభూదిని తింటానని, అది అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తన బ్యాగులో ఎప్పుడు విభూది ఉంటుందని, అది విశేషమైన చెట్టు నుంచి తయారు చేస్తారని పేర్కొంది. ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం శివ కార్తికేయన్‌ హీరోగా కమలహాసన్‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది. 

(ఇదీ చదవండి: మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)