Breaking News

బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటం నయం: సదా

Published on Sun, 05/07/2023 - 15:23

అదృష్టం బాలేకుంటే, అరటిపండు తిన్నా పళ్లు విరిగినట్లు.. అగ్రహీరోలతో నటించినా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది నటి సదా. అందుకే, కాస్త సమయం తీసుకుని ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లలో తన సత్తా చాటుతోంది. 

► మహారాష్ట్రలోని రత్నగిరి సదా సొంతూరు. తండ్రి డాక్టర్,  తల్లి బ్యాంక్‌ ఉద్యోగి. రత్నగిరిలోని సేక్రెడ్‌ హార్ట్స్‌ కాన్వెంట్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, ముంబై చేరింది. 

► అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ‘జయం’ లో అవకాశం ఇచ్చాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే, ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్‌ మిస్‌ అయింది. 

► ఆ తర్వాత ‘దొంగ దొంగది’, ‘అపరిచితుడు’, ‘మోనాలిసా’, ‘లీలా మహల్‌ సెంటర్‌’, ‘ఔనన్నా కాదన్నా’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘వీర భద్ర’, ‘టక్కరి’ వంటి పలు చిత్రాల్లో  నటించినా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. దీంతో రూట్‌ మార్చి, బుల్లితెరపై మెరిసింది. 

► పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరించి తెలుగువారికి మరింత దగ్గరైంది. వీటితోపాటు యూట్యూబ్‌ వేదికగా సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. 

► ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘హలో వరల్డ్‌’ సిరీస్‌లో పవర్‌ఫుల్‌ లేడీ బాస్‌గా కనిపిస్తోంది.

ఇంట్లో ఎలాగైతే అవసరం లేని వస్తువులను బయటపడేసి శుభ్రం చేసుకుంటామో, అలాగే మన జీవితాల్లోంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండటం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటం మంచిది
– సదా

చదవండి: మైనస్‌ 15 డిగ్రీల చలిలో హీరోయిన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)