Breaking News

గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్‌.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

Published on Tue, 03/10/2026 - 10:20

టాలీవుడ్‌ నటి రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. హీరో గోపీచంద్‌  ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె అలరించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతానికి టైటిల్‌ ఖరారు కాని ఈ మూవీని దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఘాజీ, ఐ.బి 71, అంతరిక్షం చిత్రాలతో భిన్నమైన చిత్రాలతో మెప్పించిన సంకల్ప్‌ రెడ్డి... ఈసారి భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని వెండతెరపై చూపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా రీతూ వర్మ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.
 

(Gopichand 33) పేరుతో ప్రారంభమైనే ఈ ప్రాజెక్ట్‌లో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ఆమె అత్యంత కీలకమైన పాత్రలోనే నటిస్తున్నట్లు పోస్టర్ సూచిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ దీనిని సమర్పిస్తున్నారు.  7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు.

భారతదేశ చరిత్రలో అందరూ  మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని ఈ చిత్రంతో తెరపై చూపించనున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా కూడా చర్చల్లోలేని ఈ కథను చెప్పబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం గోపీచంద్‌  ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.  సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఎస్ (హిట్ 1, హిట్ 2, గీత గోవిందం, సైంధవ్), ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)