Breaking News

ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన రీతూ చౌదరి, నో పెళ్లి అంటూ పోస్ట్‌

Published on Sat, 07/29/2023 - 14:53

నటి, జబర్దస్త్‌ బ్యూటీ రీతూ చౌదరి సోషల్‌ మీడియాలో చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్‌ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. మరోపక్క బుల్లితెరపైనా పలు షోలలో కనిపిస్తూ కామెడీ పంచులతో అలరిస్తోంది. అలాగే తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. ఆ మధ్య రీతూ చౌదరి లవ్‌లో పడిందంటూ ఓ వార్త తెగ వైరలయింది.

శ్రీకాంత్‌ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రాసుకొచ్చింది. దీంతో రీతూ-శ్రీకాంత్‌ లవ్‌లో ఉన్నారని కన్ఫామ్‌ అయిపోయింది. రీతూ నుదుటన శ్రీకాంత్‌ ముద్దు పెట్టిన వీడియో కూడా వైరల్‌ అయింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఫోటో కూడా లీకైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించనేలేదు. రీతూ తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీకాంత్‌ ఆమెను ఓదార్చడానికి రాలేనట్లు తెలుస్తోంది. పైగా రీతూ.. అతడితో కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్‌ చేసింది. దీంతో వీళ్లు అసలు కలిసే ఉన్నారా? విడిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ అనుమానాలకు తెర పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో 'నిజాలు మాట్లాడుకుందాం' అంటూ చిట్‌చాట్‌ నిర్వహించిన ఆమె.. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది, అప్పుడే సంతోషంగా ఉండొచ్చు అని రిప్లై ఇచ్చింది. శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడగ్గా లేదన్నట్లుగా తలాడిస్తూ త్వరలోనే వివరంగా చెప్తానంది. ఎవరినైనా లవ్‌ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు 'లవ్వుకో దండం.. నేను నాతో మాత్రమే ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. దీంతో రీతూ బ్రేకప్‌ నిజమేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఇంట్లో వాళ్లను కాదని డేర్‌ చేస్తున్న నిహారిక

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)