Breaking News

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Published on Tue, 12/24/2024 - 20:41

హీరోయిన్, నటి రేణుక దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.

ఇక సినిమాల విషయం పక్కనపెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్‌ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం ప్రత్యేకంగా ఒక ఎన్‌జీవోను స్థాపించింది. తన పిల్లల పేరు మీదే షెల్టర్ హోమ్‌ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్  ఆంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగజీవాల కోసం తనవంతు కృషి చేస్తోంది.

మూగజీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్‌? అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది.

renu
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)