హీరోయిన్ రష్మికా దేవరకొండకు గాయాలు

Published on Fri, 07/31/2026 - 18:06

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్‌, పాన్ ఇండియా స్టార్‌ రష్మికా దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో ఇది జరిగింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు రష్మికకు ఒక్కసారిగా జారిపడటంతో ఆమె నడుముకు బలమైన గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. రష్మికను పరీక్షించిన వైద్యులు శరీరంలోని నడము భాగంలో బలమైన దెబ్బ తగిలిందని నిర్ధారించారు. గాయం తీవ్రత దృష్ట్యా ఆమె కనీసం 6 వారాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారు.  

ఈ అనుకోని ప్రమాదం కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్న పలు సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఆమె కోలుకునే వరకు డాన్స్, ఫైట్ సీన్లతో కూడిన షెడ్యూల్స్ అన్నింటినీ దర్శకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్స్ వరసగా గాయాల బారిన పడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే రామ్ చరణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరులు గాయాలపాలయ్యారు. ఇప్పుడు రష్మికకు కూడా అలానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈమె పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈమె చేతిలో రణబాలి, మైసా మూవీస్ ఉన్నాయి. మరి ఏ మూవీ సందర్భంగా ఈ ఘటన జరిగిందనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)