Breaking News

నా ఫిట్‌నెస్ సీక్రెట్‌ ఫుడ్‌ ఇదే: రష్మిక మందన్న

Published on Fri, 09/19/2025 - 07:35

హీరోయిన్లు అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇందుకోసం కొందరు నోరు కూడా కుట్టుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటి నటీమణుల్లో రష్మిక మందన్న కూడా ఉన్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత తెలుగు, తమిళం ఇటీవల హిందీ భాషలోనూ నటిస్తూ పాన్‌ ఇండియా క్రష్‌ గా మారారు. అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం 9 ఏళ్లలోనే పాన్‌ ఇండియా కథానాయకిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తెలుగు చిత్రం పుష్ప– 2 రష్మిక మందన్న పాన్‌ ఇండియా కథానాయకిగా మార్చితే, బాలీవుడ్‌ లో నటించిన యానిమల్‌ చిత్రం మరింత స్థాయిని పెంచింది. కాగా 29 ఏళ్ల ఈ పరువాల భామ ఫిట్నెస్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

కాగా ఓ భేటీలో తన ఫిట్నెస్‌ గురించి రష్మిక మందన్న తెలుపుతూ ఉదయాన్నే లేవగానే లీటర్‌ నీళ్లు తాగుతానన్నారు. ఆ తర్వాత డైటీషియన్‌ ఇచ్చే యాపిల్‌ సైడర్‌ వినీగర్‌ సేవిస్తానన్నారు. ఇప్పుడు తాను శాకాహారిగా మారినట్లు చెప్పారు. అందువల్ల మాంసాహారం జోలికి వెళ్లడం లేదని, అదేవిధంగా వరి అన్నాన్ని ఎక్కువగా తీసుకోనని చెప్పారు. రాత్రిపూట కూడా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా టమాటో , బంగాళదుంప, దోసకాయ వంటి కాయగూరల్లో ఎలర్జీ ఉంటుందన్నారు. అందువల్ల వాటిని తినడం మానేశానన్నారు. ఇకపోతే నిత్యం సాయంకాలం శారీరక కసరత్తులు చేస్తానని రష్మిక మందన్నా తన ఫిట్నెస్‌ రహస్యం గురించి చెప్పారు. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కుబేర. ప్రస్తుతం ది గర్ల్‌ ఫ్రెండ్‌ అనే చిత్రంతోపాటూ హిందీలో తమా, కాక్‌టైల్‌ 2 చిత్రాలు చేస్తున్నారు. 

అదేవిధంగా రాఘవ లారెనన్స్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడుగా నటిస్తున్న కాంచన 4 చిత్రంలోని రష్మిక కీలకపాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా నటి రష్మిక మందన్నా మరో హిందీ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. బాలీవుడ్లో సూపర్‌ హీరో కథాంశంతో రూపొందిన క్రిష్‌ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఇప్పటికే మూడు భాగాలు రూపొందాయి. కాగా తాజాగా క్రిష్‌ –4 తెరకెక్కనుందని అందులో హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రోతో కలిసి నటి రష్మిక మందన్న నటించనున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)