Breaking News

16 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అందాల భామ

Published on Wed, 03/04/2026 - 15:34

1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో మొత్తం 100కుపైగా చిత్రాల్లో కథానాయికిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో కథానాయకిగా పరిచయమై , ఆ వెంటనే. మాతృభాషలో (తెలుగు) ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, బోజ్‌పురి ఇలా ఎనిమిది భాషల్లో నటించారు. 

తెలుగులో  చిరంజీవి, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు, అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, కార్తీక్, అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టారు. నిర్మాతగాను అవతారమెత్తిన ఈమె కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. కథానాయకిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగా ఇంద్రకుమార్‌ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. వీరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

కాగా వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న రంభ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ కావడానికి సిద్ధమవుతున్నారు.  ఇటీవల చెన్నైకి చేరుకున్న ఈ భామ సినిమాల్లో అవకాశాల వేట మొదలుపెట్టారు. అందుకుగాను 49 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకున్నారు. 

సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంటూ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొత్తం మీద తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అలా అందాల భామ రీఎంట్రీ షురూ అయింది అన్నమాట.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)