Breaking News

రాధికా శరత్‌కుమార్‌ రికార్డ్‌.. తొలి హీరోయిన్‌గా గుర్తింపు

Published on Thu, 03/12/2026 - 17:28

ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్‌ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్‌ పేపరుతో టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని  విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో  సీనియర్ నటి రాధిక శ‌ర‌త్ కుమార్ నటించిన  తాయి కిళ‌వై చిత్రం తక్కువ టికెట్‌ ధరలతోనే భారీ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్‌పై రాధికా శరత్‌కుమార్‌ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000  వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్‌ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్‌ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్‌ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్‌ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని  తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.

రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు.  చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌పై రాధిక ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్‌ సినిమాల పేరుతో టికెట్‌ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.

తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటుగా లాభాల వాటాను  అందుకున్న నటిగా రాధికా రికార్డ్‌ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్‌కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్‌ను అభినందించాలని ఆమె కొనియాడారు.
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)