Breaking News

ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్‌ ఎందుకంటే?: టాక్సీవాలా హీరోయిన్‌

Published on Tue, 04/08/2025 - 16:07

మెజారిటీ హీరోయిన్లు వరుస సినిమాలతో దూకుడు పెంచుతుంటే ప్రియాంక జవాల్కర్‌ (Priyanka Jawalkar) మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే వచ్చిన మ్యాడ్‌ స్క్వేర్‌లో నటించి అలరించింది. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రియాంక జవాల్కర్‌ మాట్లాడుతూ.. నేను మొదటగా టాక్సీవాలా సినిమాకు సంతకం చేశాను. ఈ సినిమా కోసం యాక్టింగ్‌ క్లాసులు తీసుకుంటున్న సమయంలో కల వరం ఆయె చిత్రయూనిట్‌ నన్ను సంప్రదించారు. 

బడ్జెట్‌ లేదని పారితోషికం వద్దన్నాను
వారు అప్పటికే ఓ హీరోయిన్‌తో షూటింగ్‌ చేశారట.. కానీ అది నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారు. సరే అని చేశాను. అయితే అప్పుడు నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి వారి దగ్గర బడ్జెట్‌ కూడా లేదు. మా దగ్గర రూ.10 వేలు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్‌ లేనప్పుడు ఇవ్వడం దేనికిలే.. అని వద్దన్నాను. నా స్నేహితురాలేమో చేస్తున్న పనికి ఎంతోకొంత తీసుకోవాలి కదా అని వారించింది. దాంతో వాళ్లకు ఫోన్‌ చేసి ఆ పది వేలు తీసుకుంటానన్నాను. 

మొదటి పారితోషికం ఎంతంటే?
నేను వద్దన్నానని వేరేవాటి కోసం కొంత వాడేశాం.. ఇప్పుడు మా దగ్గర రూ.6 వేలే ఉన్నాయని చెప్పారు. అలా నేను తొలి సినిమాకు రూ.6 వేలు తీసుకున్నాను. తర్వాత ఓ యాడ్‌ కోసం రూ.10 వేలు తీసుకున్నాను. ‍కథ బాగుంటేనే సినిమాలు చేయాలని నియమం పెట్టుకున్నాను. అందుకే గమనం సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్‌ వచ్చింది. టిల్లు స్క్వేర్‌లో 15 సెకన్లు మాత్రమే కనిపించే రోల్‌ చేశాను. తెలుగు, తమిళంలో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో, ఓ తమిళ సినిమాలో నన్ను చివరి నిమిషంలో తీసేశారు అని ప్రియాంక జవాల్కర్‌ చెప్పుకొచ్చింది. ప్రియాంక.. టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం, గమనం సినిమాలు చేసింది.

చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్‌ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)