Breaking News

షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ

Published on Tue, 10/25/2022 - 15:22

హీరోయిన్‌ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం,  మా ఆవిడ కలెక్టర్‌, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్‌​ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్‌ 28న విడుదల కాబోతోంది.

చదవండి: రామ్‌ చరణ్‌ మాటలకు ఏడ్చేసిన జపాన్‌ ఫ్యాన్స్‌

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ టాక్‌లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్‌ కుమార్‌తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్‌ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్‌ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్‌ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్‌ తీస్తున్నా డైలాగ్‌ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్‌ నాపై అరిచారు. బ్రేక్‌లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది.  ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?. 

చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్‌

15 షాట్స్‌ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్‌ రెడీ కాగానే వెళ్లి డైలాగ్‌ చెప్పాను. సింగిల్‌ షాట్స్‌లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్‌ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్‌ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్‌ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్‌ రోల్‌. ఆయనను డైరెక్ట్‌గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది.  

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)