ఆడుకుంటూ ఆడుకుంటూ ఘోర ప్రమాదం.. బుడ్డోడిని కాపాడిన పోలీసులు
Breaking News
విజయ్ ఆంటోనికి జోడీగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్..
Published on Sat, 04/25/2026 - 06:42
వైవిధ్య కథా పాత్రలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా శశి దర్శకత్వంలో నటించిన నూరుసామి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్ అంటోని తన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ఎం.మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇరవుక్కు అయిదు కంగళ్, కన్నై నంబాతే (కళ్లను నమ్మొద్దు), బ్లాక్ మెయిల్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం.

జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. తాజాగా సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి అప్పాకుట్టి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా ప్రీతి అస్రాని నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
తెలుగులో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? చిత్రంతో ప్రీతి అస్రాని చైల్డ్ ఆర్టిస్‌గా వెండితెరకు పరిచయం అయింది. 'మళ్లీ రావా', గుండెల్లో గోదారి, దొంగలున్నారు జాగ్రత్త, సీటీమార్, తదితర సినిమాల్లో నటించిన ప్రీతి ఆస్రానీ హీరోయిన్‌గా ఇప్పటికే తమిళంలో 'కిస్' మూవీతో వచ్చింది.
Tags : 1