Breaking News

ఏడో నెలలో పూర్ణకు మరో వేడుక.. వీడియో వైరల్‌

Published on Thu, 03/02/2023 - 11:15

'సీమటపాకాయ్‌'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటి పూర్ణ 'అవును', 'అవును 2' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే సువర్ణ సుందరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే గతేడాది దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ను పెళ్లాడింది. అదే ఏడాది చివర్లో త్వరలో తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవలే ఆమె సీమంతం కూడా ఎంతో వేడుకగా జరిగింది. ప్రస్తుతం పూర్ణకు ఏడవ నెల.

కేరళలోని కానూర్‌ సాంప్రదాయం ప్రకారం ఏడో నెల గర్భవతికి ఓ వేడుక చేస్తారట. ఈ సాంప్రదాయ తంతుకు సంబంధించిన వీడియోను పూర్ణ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో భాగంగా పూర్ణ నడుముకు ఓ తెల్లటి వస్త్రాన్ని కట్టి దాన్ని నల్ల తాడుతో బలంగా ముడివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను మనసారా ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు మాత్రం పెళ్లై నాలుగే నెలలే అయింది, అప్పుడే ఏడో నెలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా పూర్ణ పెళ్లి గతేడాది జూన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. కానీ తన పెళ్లి ఫోటోలను మాత్రం అక్టోబర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆమె అక్టోబర్‌ నెలాఖరులోనే షాదీ చేసుకుందని నెటిజన్లు పొరపడుతున్నారు. ఇకపోతే 2004లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూర్ణ ఇప్పటివరకు 60కు పైగా చిత్రాల్లో నటించింది. అంతేకాక బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.

చదవండి: నన్ను ఆదుకున్నాడు.. నేను, నా ఫ్యామిలీ మూడు పూటలా తింటున్నామంటే ఆయనే కారణం

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)