Breaking News

కుర్చీ మడతపెట్టి సాంగ్‌.. నా లుక్‌ చూసి ట్రోల్‌ చేస్తారనుకున్నా!

Published on Wed, 09/18/2024 - 18:50

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బొద్దుగా తయారవుతుంటారు. ముందు ఎలా ఉన్నా సరే తల్లయ్యాక మాత్రం శరీర సౌష్ఠవమే మారిపోతుంది. సమయమే కొందరిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తే మరికొందరు మాత్రం జిమ్‌, డైటింగ్‌తో సన్నబడి నాజూకుగా అవుతుంటారు. అందరిలాగే డెలివరీ తర్వాత హీరోయిన్‌ పూర్ణ కూడా బొద్దుగా అయిపోయింది. 

లావయ్యా.. సాంగ్‌ చేయగలనా?
సరిగ్గా అదే సమయంలో తనకు గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన రియాక్షన్‌ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్‌ మాస్టర్‌ నాకు ఫోన్‌ చేసి కుర్చీమడతపెట్టి పాట ఆఫర్‌ చేశారు. మాస్టర్‌, నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను, ఈ అవతారంలో నేను చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగిపోయాను.

అదే హైలైట్‌ చేస్తామనడంతో..
నాపై నేనే అపనమ్మకంతో ఉన్నాను. కానీ సినిమా టీమ్‌, డైరెక్టర్‌ నా డ్యాన్స్‌ కన్నా ఎక్స్‌ప్రెషన్స్‌ హైలైట్‌ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌కు ఒకరోజు ముందు కూడా నేను రావాల్సిందేనా? అని అడిగాను. అందుకు అవునన్నారు. అయితే సోషల్‌ మీడియాలో నా ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లు. 

మీరు తిట్టేది తల్లినే
అవి చూసి చాలా బాధపడ్డాను. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో? ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే ఆ సాంగ్‌లో కనిపించేందుకు అంగీకరించాను. ఆశ్చర్యమేంటంటే.. నా పర్ఫామెన్స్‌ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది' అని పూర్ణ చెప్పుకొచ్చింది.

 

చదవండి: బిగ్‌బాస్‌ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి