Breaking News

పెళ్లయి 21 ఏళ్లు.. తల్లి కావాలనుంది: పద్మప్రియ

Published on Mon, 02/10/2025 - 16:39

పద్మప్రియ (Padmapriya Janakiraman).. ఒకప్పుడు మలయాళంలో టాప్‌ హీరోయిన్‌. తెలుగులో శీను వాసంతి లక్ష్మి (Seenu Vasanthi Lakshmi Movie), అందరి బంధువయ, పటేల్‌ సర్‌ చిత్రాల్లోనూ నటించింది. ఈమె తన చిరకాల మిత్రుడు జాస్మిన్‌ షాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై రెండు దశాబ్దాలవుతున్నా వీరికి ఇంతవరకు సంతానం లేదు. ఆ ఒక్క ముచ్చట కూడా తీరిపోయుంటే తన జీవితం మరింత సంతోషమయమై ఉండేదంటోంది పద్మప్రియ.

ఎన్నో చేయాలనుకున్నా..
తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ముచ్చట్లను పంచుకుంది. పద్మప్రియ మాట్లాడుతూ.. ఎన్నో సినిమాలు చేయాలనుకున్నాను. కానీ అదే సమయంలో బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నటిగా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎన్నో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేసినప్పటికీ మంచి అవకాశాలు అంత త్వరగా వచ్చేవి కావు. అందుకే బ్రేక్‌ తీసుకున్నాను. అంతేకాదు.. ముప్పై దాటిందంటే హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అందుకే నా అంతట నేనే సైడ్‌ అయిపోయా!

పిల్లలు కావాలనుంది
అయినా ఇలాంటి బ్రేక్స్‌ తీసుకోవడం యాక్టర్స్‌కు అవసరం అని నా అభిప్రాయం. ఇప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది. ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను.. కానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాను. సినీ ఇండస్ట్రీలోకి రాకూడదనుకున్నాను.. కానీ వచ్చాను. బ్రేక్‌ తీసుకున్నప్పుడు కూడా మళ్లీ సినిమాలు చేయొద్దనుకున్నాను కానీ చేశాను. అందుకే జీవితం ఎప్పుడు? ఎలా? ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం చెప్పలేం అంటోంది పద్మప్రియ.

సినిమా
ఈమె అమృతం, కరుత పక్షికల్‌, మిరుగం, పళస్సి రాజాచ తమాషు, ఒరు తెక్కన్‌ తల్లు కేస్‌ వంటి మలయాళ చిత్రాలతో పాటు తంగ బీన్‌కల్‌, క్రాస్‌రోడ్‌ వంటి తమిళ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. 2014లో జాస్మిన్‌ షాను పెళ్లాడింది.

చదవండి: ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్‌ లవ్‌ నోట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)