Breaking News

సీనియర్‌ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..

Published on Thu, 09/07/2023 - 12:54

సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్‌, శోభన, సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ ఇంట చోరీ జరిగిన సంఘటనలు మరువకముందే మరో సీనియర్‌ హీరోయిన్‌ నిరోషా ఇంట దొంగతనం జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు కాజేశారంటూ నిరోషా.. తేనాంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు సైతం కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట దొంగతనం జరగ్గా ఇంటిదొంగను పోలీసులు పసిగట్టేశారు. ఇంట్లో పనిచేసే మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తర్వాత శోభన ఇంట్లో దొంగతనం జరగ్గా.. అక్కడ కూడా తన పనిమనిషే చోరీకి పాల్పడినట్లు తేలింది. సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ ఇంట నగలు కనిపించకుండా పోగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా ఘర్షణ(1988) సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన నిరోషా ఈ చిత్రంతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ ఈత కొలనులో హొయలొలికించింది. ఇప్పటికీ ఈ పాట మార్మోగిపోతూ ఉంటుంది. సింధూరపువ్వు సినిమా సైతం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలేవీ చేయని నిరోషా ఆ మధ్య క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్‌ సలాంలో రజనీకాంత్‌ భార్యగా నటిస్తున్నట్లు టాక్‌!

చదవండి: తలపొగరుతో బిగ్‌బాస్‌నే తిట్టిన శివాజీ.. ఈ క్షణమే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానంటూ..

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)